గాయానికి ఉప్పు

by Ravi |   (  Updated:2025-11-23 23:00:50  IST  )

Poem

గాయానికి ఉప్పు
X

గాజాలో

కొత్త గాయాల మీద

ఉప్పుచల్లుతుంటాం

చనిపోయిన వాళ్ళ

చల్లని చర్మంమీదా

ప్రేమికులు కాళ్ళ మీదా

అసంబద్ధ వాస్తవాల కళ్ళలో

ఉప్పుచల్లుతుంటాం

గాజాలో

గాయాల్ని మాన్పడానికి

ఉప్పుచల్లుతుంటాం

మా పూర్వీకులు

కొత్త గాయాల మీద ఉప్పుచల్లేవారు

కాని.. ఇదే ఉప్పు

నా తీవ్ర, అకాల నష్టాలను

దూరంచేయదేమి

నా గాయాలెందుకు

ఇంకా పచ్చి పచ్చిగా

సలుపుతున్నాయి

నా బాధ

ఎందుకింత పెళుసుగా ఉంది

ఈ ఉప్పెందుకు

నా గాయాలను మాన్పడంలేదు?

మూలం: మహమ్మద్ మూసా

Salted Wounds

స్వేచ్ఛానువాదం: ఉదయమిత్ర

891 965 0545

Next Story