రిటర్న్ గిఫ్ట్..

by Ravi |   (  Updated:2025-11-24 00:01:00  IST  )

Poem

రిటర్న్ గిఫ్ట్..
X

రహదారులిపుడు

రక్తదాహార్తులయ్యాయి

సర్కారుకు రొక్కం చెల్లించి

మరీ ప్రమాదాలను

రిటర్న్ గిఫ్ట్ పొందుతున్నాం

జనం ఘోషను వినే

నాథుడు లేడు

రోడ్లపై గుంతలు

కనే నేతలు లేరు

నాసిరకం నాణ్యత

ప్రయాణికులకు లేదు భద్రత

కుర్చీలకు, ఖజానాకు లేదు

ఏమాత్రం దోఖా..

అందుకే

మీ చావు మీరు

చావండని జనతకు

అసెంబ్లీ, పార్లమెంటూ

అప్రకటిత సందేశ వార్త......

-శ్రీనివాస్ కాలె

90594 50418

Next Story