తెలంగాణ తల్లీ కన్నీరు

by Ravi |   (  Updated:2025-11-16 23:15:08  IST  )

Poem

తెలంగాణ తల్లీ కన్నీరు
X

తెలంగాణ మట్టి కన్నీరు కారుస్తోంది నేడు,

ఆ మట్టిలో పుట్టిన కవిశేఖరుడు లేడుగా!

జై తెలంగాణ నినాదం మొదలైన చోట,

ఆ స్వరం నిశ్శబ్దమై గాలిలో కలిసిపోయింది.

పల్లె పొలాల దుర్బల గోరు ముద్దాడిన వాడే,

ప్రకృతి నడుమ ఆశల దీపం వెలిగించిన వాడే,

ఆయన మాటలే మాకు బలమయ్యాయి,

ఆయన కవితలే మన గుండెల ధ్వనిగా మారాయి.

“మా తెలంగాణా” అంటూ ఊపిరి పోసిన కవి,

ఇప్పుడు ఆ ఊపిరే గాలిలో కలిసిపోయింది,

కానీ ఆయన స్వరం ప్రతి చెట్టు

ఆకులో, ప్రతి గీతలో వినిపిస్తూనే ఉంటుంది.

కాగితమంతా ఆయన రక్తం తడిపిన పదాలు,

ప్రతి వాక్యం.. తిరుగుబాటు, చైతన్య జ్వాల,

ప్రతి అక్షరం.. రైతు, తెలంగాణ ధ్వని.

ఇప్పుడు ఆ గుండె ఆగిపోయినా, గళం మాత్రం చావదు.

తెలంగాణ గుండెలలో ఆయన పేరు చిరస్థాయి,

మా భూమి, మా భాష, మా మనసు అందెశ్రీ రూపం,

తన కవితలో జీవించి ఉన్నాడు నేడు కూడా,

అందెశ్రీ లేని తెలంగాణ ఊహించడం కష్టమేగా...

(అందెశ్రీ స్మృతికి)

-ముహమ్మద్ అజీజుద్దీన్

70131 76656

Next Story