- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
తుది దశ తెలంగాణ పోరుకు..
అక్షర సిరి... అందరి కవి...
ఆత్మ గౌరవ కవి... అందె శ్రీ...
మట్టిలో మాణిక్యం....
పామరత్వంలో పాండిత్యం....
మినుగురులా మెరిసి....
దీపమై వెలిగి..
కాగడై ప్రకాశించి...
కవనపు ఆజ్యంతో...
ప్రజ్వలించే ఉద్యమం.
ప్రాంతేతర పాలన
సాంతం అంతం చేసే.
తెలం''గానం'' వినిపించే.
జయకేతన తెలంగాణకి
గేయ తిలకం దిద్దె.
తల్లి తెలంగాణని
నిత్య ముత్తేదువు చేసే.
స్వరాష్ట్ర నిరంకుశం
స్వభిమానం ముందు తలవంచే.
మాయమై పోయాడు
మనసున్న వాడు.
చిరంజీవి ఎప్పుడూ
ప్రజల గొంతుకలందు...
ప్రజాకవి అందెశ్రీకి నివాళి
- నక్క శ్రీనివాస్,
98486 13844
- Tags
- Poem
Next Story






