అలిసి ఆగిన అందె శ్రీ కలం

by Ravi |   (  Updated:2025-11-16 23:45:43  IST  )

Poem

అలిసి ఆగిన అందె శ్రీ కలం
X

జయ జయహే తెలంగాణ

అని రాసిన నీ కలం.

తెలంగాణ జనులందరిని

ఏకం చేసింది.

ప్రత్యేక తెలంగాణ

ఉద్యమానికి ప్రాణం పోసింది.

తెలంగాణ రాష్ట్ర

ఆవిర్భావానికి దారితీసింది.

తెలంగాణ రాష్ట్ర

గీతమయ్యేలా మలిచింది.

ఎన్నో అద్భుతమైన పాటలకు

ఊపిరి ఊదింది.

పెద్ద సదువులు లేకున్నా

సాహిత్య లోతులను చూపింది.

మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడని

మనిషి విలువలను తెలిపింది.

తెలంగాణ మమకారాన్ని పంచింది.

జన జాతరలో మనమంతా

అని యువతరాన్ని ఉర్రూతలూపింది.

అన్యాయాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నించింది.

పాటకై ప్రతినిత్యం పరితపించింది.

పశువుల కాపరిని

గౌరవ డాక్టరేట్ ను చేసింది.

ఆ కలం ఇప్పుడు నీవు లేవని

కన్నీరు పెడుతుంది.

నిన్ను రప్పించుమని

ఆ దేవునితో మొరపెట్టుకుంటుంది.

రా.. అందె శ్రీ

తెలంగాణ "కవి"గా...!

ఉదయించే "రవి" గా...!!

-చకినారపు సతీష్ కుమార్

Next Story