అక్షర విత్తులు..!

by Ravi |   (  Updated:2025-11-16 23:00:06  IST  )

Poem

అక్షర విత్తులు..!
X

కాగితపు పొలం పైన

కలం అనే హలంతో సాలళ్ళు వేసి

అక్షర విత్తులను వెదజల్లుతాను

కవిత్వమనే మొక్క చిగురించి

వాక్యాలనే కొమ్మలకు

భావం ఊయలై ఊగుతుంటే

అందులో తేలిపోతూ ఆనందించాను

ప్రతి పదం ఒక కుసుమమై

తీయని ఫలంగా ఎదిగి

మెదడుకు ఆహారమౌతుంటే

జ్ఞానాన్ని బాగా జీర్ణించుకున్నాను

కలుపు మొక్కల్ని

అర్థవంతమైన పదాల బాణాలతో

సంధిస్తూ సందేశమిస్తుంటే

లోలోపల పొంగిపోయాను

గుట్టలు గుట్టలుగా కవనాలు

రకరకాల చెట్లవలే గుబురుగా

పుస్తకంలో పేజీల్లా

రెపరెపలాడుతుంటే

హాయిగా ఆస్వాదించాను

నేను రైతు కవిని

చిగురించే ప్రతి

అక్షరాన్ని హత్తుకుని

భావ పరిమళ స్వేచ్ఛతో

చైతన్యమై ఎదుగుతాను

- నరెద్దుల రాజారెడ్డి

96660 16636

Next Story