రాతలు నుదుటి గీతలు

by Ravi |   (  Updated:2025-11-09 23:45:59  IST  )

Poem

రాతలు నుదుటి గీతలు
X

నువ్వు ఉన్నట్టు తెలియాలి

కాస్త కదలికనన్న చూపించాలి

లేకపోతే చచ్చిన శవమౌతావు

ఓటు కోసమైనా ఓటరు

గుర్తింపు కార్డులో

నీ బొమ్మ చూపించాలి

నిన్నటి వరకు నీ పేరు ఎల్లిగాడు

ఇప్పుడు డప్పుఎల్లయ్య

పేరు అడిగితే ఎల్లిగాడు అంటే చెల్లదు

ఆ ఒక్క రోజు డప్పుఎల్లయ్యవు

నీవే నని నీ పక్క వాళ్ళ అన్న చెప్పాలి

లేదంటే చెల్లని ఓటు అయిపోతావు

కులం కనిపించకున్నా నీ పేరే

నీ కులాన్ని గుర్తు చేస్తుంది

అంత బలంగా వేళ్లూనుకున్నాయి

ఏ రాతలు గీతలు చెరుపలేవు

ఆ రాతలే కొందరికి నుదుటి గీతలౌతాయి

తరతరాలకు తరగని నూకలౌతాయి

-గుండెల్లి ఇస్తారి

98499 83874

Next Story