వందేమాతరం

by Ravi |   (  Updated:2025-11-10 00:00:31  IST  )

Poem

వందేమాతరం
X

వందేమాతరం

వందే వందే వందే వందే

వందేమాతర గీతం

వందే వందే l వందే ll

వాక్కువై పుట్టినావు

గేయమై నిలిచినావు

యావత్ భారత మంత

గొంతుకై కదిలినావు

అడుగడుగునా అణువణువునా

దేశభక్తి నూరిపోసి

ఆంగ్లేయుని గుండెల్లో

అగ్నివయ్యి నిలిచినావు ll వందేll

కాశ్మీరు కాగడై కన్యకు

మరి కిరణమై

అటకు అంచు అంశవై

కటకు అంచు కావ్యమై

కడదాకా స్వాతంత్రపు

కల నెరవేరే దాకా

చైతన్యము తెచ్చి నీవు

శక్తివయి నిలిచినావు ll వందే ll

కుల మత జాతి ప్రాంత

విభేదాలు రాకుండా

అంతరాత్మ ఒకటి చేసి

ఆయుధమయ్యి నిలిచి

తరతరాల యుగయుగాల

తలరాతను మార్చినీవు

తరంగమై మృదంగమై

ప్రతి తనువును తాకినావు ll వందే ll

నీలో నీ ప్రతి పలుకు

నీలో నీ ప్రతి అణువు

నీలో నీ ప్రతిభావం

నిరంతరము చైతన్యమే

నాటి నుండి నేటి వరకు

జన జాగృతి గీతమై

యావత్ భారతావని

ఏకంగా నిలిపినావు. Il వందll

- జక్కులపల్లి గోపాల్

Next Story