హత్య చేయబడిన చెట్టు

by Ravi |   (  Updated:2025-11-09 23:45:29  IST  )

Poem

హత్య చేయబడిన చెట్టు
X

ఈ దారంతా వొకప్పటిలా లేదు

మరుభూమిలా సమాధులే

కనిపిస్తున్నాయి.. ఇక్కడున్న చెట్లను

ఎవరో ఖచ్చితంగా హత్య చేసి వుంటారు

కొమ్మలూ, ఆకులూ

చెట్టు మొదట్లో పడి

బంధువుల్లా రోదిస్తున్నాయి

ఎవరు నాటారో ఇవన్నీ

వారి అనుమతి తీసుకున్నారా?

లేక నరికిన గుంతల్లో

ఇంత ప్రాణవాయువైనా..

కొంత నీడనైనా పోశారా ?

ఇక్కడ నేను బ్రతకలేను

చెట్టున్న చోటుకే నా

ఊపిరితిత్తులను తీసుకుపోతాను

లేదు ఈ దృశ్యం చూసిన క్షణమే

నేనూ హత్య చేయబడ్డాను !

-గుబ్బల శ్రీనివాస్,

89066 97777

Next Story