పేరులో ఏముంది

by Ravi |   (  Updated:2025-11-10 00:30:05  IST  )

Poem

పేరులో ఏముంది
X

అంతా పేరులోనే ఉంది

నేను బయటికి వెళ్లడం

క్షేమంగా తిరిగి రావడం

నా పేరును బట్టే ఉంటది.

ఏమో

..ఆక్లాక్, జునైద్‌ల గతే

నాకూ పట్ట వొచ్చు

నా పేరు వెంట

ఏం మృత్యువు

ఏ రూపంలో పొంచి ఉన్నదో

ఎవరికి తెలుసు?

నాకు

ఉచిత రేషన్ ఇస్తరో, ఇవ్వరో.

పాస్ పోర్టు ఆఫీసులో

బంగ్లాదేశీయురాలివని

ప్రశ్నిస్తారో ఏమో.

పాపం...

షేక్స్పియర్ ఊహించి ఉండడు

అంతా పేరులోనే ఉందనీ..

మూలం...మౌమితా ఆలం

(What is in a name..)

స్వేచ్ఛానువాదం: ఉదయమిత్ర

89196 50545

Next Story