- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
అంతన్నాడు
ఇంతన్నాడు
కొండంత రాగం తీసాడు
వేలం పాట పాడాడు
పై నుంచి కిందికి
పండేది పది పదిహేను క్వింటాళ్లు
ఎగేసుకొచ్చి కిసాన్ కపస్
ప్రచారార్భాటాలు
చివరికి ఏడు క్వింటాళ్ళే
కొంటమంటున్నారే!!
ఏడు నువ్వుకొంటే మిగతాది
నీ దళారికి దమ్మిడికే అమ్మాలా!
ఎవడెవడికో అప్పనంగా మాఫీ
ప్రజాస్తులు ఎకరాలు
వందలకే కట్టబెడుతారే
నేలను నమ్మి నేలను
విడవని రైతు పంటకి
ధర నిర్ణయాధికారమే లేదే!
చివరికి ఈ దేశం
దిగుమతులపైనే బతకాలేమో!!
కపస్ కసి దీరా రైతును ముంచేస్తుంది!!
-గిరి ప్రసాద్ చెలమల్లు
9493388201
- Tags
- Poem
Next Story






