- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
కలే కదా. ఇదంతా కలే కదా
ఇంకా వినపడుతున్నాయా నీకు
ఆ.. ఆర్తనాదాల శ్రావ్యగీతాలు
మనసు మూసేసుకున్నావు కదా
ఎందుకంటే నువ్వు చీకటి కాగడాలో
మసి చూరిన కలలను వెతికే
ఆశావాదివి కదా
ఎందుకలా మొహం తిప్పుకుంటావ్
ఇదిగో ఇక్కడ ఫొటోలు తియ్యి
మెరిసే నా దేహం మసిబార కూడదు సుమా!
ఇదిగో ఇక్కడ చూడు
కుటిల పరిహాసపు నగ్న కీలలలో
మసి పట్టిన సాక్ష్యపు ఆనవాలు
ఎంత ఓపికో నాకు
గొంతు నొక్కేసుకుని మరీ వెతుకుతున్నా
ఎడారి పట్టిన మనసుల్ని తవ్వి తీస్తూ
దప్పిక పట్టిన చేతుల కోసం
నీటి చలమల్లే అక్కడే ఆగిపోయా
ఎండమావి ఎప్పుడూ
నువ్వు పట్టిన సమాజమే సుమా
ఎందుకో నిదుర వస్తోంది
ఉలికిపాటునైనా
నిన్ను కలగా కంటూనే ఉంటాను
ఒట్టు నేస్తం నేనింకా బతికే ఉన్నా
నువ్వు ఆగి ఆగి చూసే చూపులలో
ఒక వేకువ రాలిపోయిందని చెప్పడానికి
-శైలజ మంగళంపల్లి
77020 15043
- Tags
- Poem
Next Story






