వాస్తవాలు

by Ravi |   (  Updated:2025-11-02 22:45:48  IST  )

Poem

వాస్తవాలు
X

నమ్మకాన్ని అమ్ముకు తిరిగే

కుక్కలతో స్నేహం చెయ్యకు

నీతోనే వుంటూ నీ రహస్యాల్ని

సొమ్ము చేసుకునే నీతిని కోల్పోయిన

వారితో లావాదేవీలు పుచ్చుకోమాకు

కులమేదైనా మతమేదైనా

న్యాయం నీలో, నాలో ఉంటే

బ్రతుకు భారమనిపించదు

నకిలీ మనస్తత్వాన్ని అలుముకోకుంటే

స్థితిని, గతిని కోల్పోక తప్పదు

భువిపై ఉన్నన్నాళ్ళు

నీ చుట్టూ నవ్వులు కాదు ఋజువులు

కన్ను మూశాక మూడడుగుల గుంతలో

నువ్వున్నప్పుడు చుట్టూ నలుగురు

మాట్లాడుకుంటారు అవి వాస్తవాలు

-వాసి జ్యోత్స్న

98668 43005

Next Story