హత్య చేయబడిన చెట్టు

by Ravi |   (  Updated:2025-11-02 23:00:20  IST  )

Poem

హత్య చేయబడిన చెట్టు
X

ఈ దారంతా వొకప్పటిలా లేదు

మరుభూమిలా సమాధులే

కనిపిస్తున్నాయి.. ఇక్కడున్న చెట్లను

ఎవరో ఖచ్చితంగా హత్య చేసి వుంటారు

కొమ్మలూ , ఆకులూ

చెట్టు మొదట్లో పడి

బంధువుల్లా రోధిస్తున్నాయి

ఎవరు నాటారో ఇవన్నీ

వారి అనుమతి తీసుకున్నారా ?

లేక నరికిన గుంతల్లో

ఇంత ప్రాణవాయువైనా..

కొంత నీడనైనా పోశారా ?

ఇక్కడ నేను బ్రతకలేను

చెట్టున్న చోటుకే నా

ఊపిరితిత్తులను తీసుకుపోతాను

లేదు ఈ దృశ్యం చూసిన క్షణమే

నేనూ హత్య చేయబడ్డాను !

-గుబ్బల శ్రీనివాస్,

89066 97777

Next Story