స్వభావం

by Ravi |   (  Updated:2025-11-02 23:15:53  IST  )

Poem

స్వభావం
X

తగులబడ్డారు నడిరోడ్డుపై

సూర్యోదయానికి

ముందే అస్తమించారు

వాళ్లు చేసిన నేరం

డబ్బులెట్టి బస్సెక్కడం

గమ్యానికి చేర్చే బదులు

కాటికి పంపారు

మోగిన గొట్టాలు మూగబోయాయి

శవాల మీద డబ్బులు

విదిల్చి నిమ్మకుంది రాజ్యం

నేరస్తుడు బయటే తిరుగుతున్నాడు

రాజ్యం ముఖం చూసి

బొట్టు పెడుతుంది

కులం మెట్ల మీద

నేరం కడిగి పారేసి

వార్తను రూపుమాపింది

ఒక్క గొంతు పెగలదు

ఉరుకులు పరుగుల

ప్రయాణంలో అది అంతేనని

రాజ్యం సమాధి కడుతుంది !

ఎన్నాళ్లో ఈ పయనాలు పతనాలు!!

- గిరి ప్రసాద్ చెలమల్లు

94933 88201

Next Story