నిలకడ

by Ravi |   (  Updated:2025-11-02 23:00:50  IST  )

Poem

నిలకడ
X

పచ్చదనం ప్రకృతి తొలి పుత్తడి

పట్టి వుంచడమెంత కష్టం.

దాని తొలి పత్రం ఓ పుష్పం

కానీ, అదీ తాత్కాలికమే.

ఆకు తర్వాత ఆకూ అంతే.

అందుకే ఈడెన్ దుఖంలో మునిగింది

అందుకే పొద్దుగుంకింది

పుత్తడైనా, నిలిచిపోదు ఎప్పటికీ.

ఇంగ్లీష్: రాబర్ట్ ఫ్రాస్ట్

తెలుగు: దేశరాజు

99486 80009

Next Story