- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
తుపాకులు మొరగడం ఆగిపోతుంది
యుద్ధ విరమణ జరిగిపోతుంది
నాయకులు కరచాలనం చేసుకుంటారు
శాంతి ముసుగు చాటున
రక్తపు కోరలు కప్పబడతాయి
శిథిల నగరం మీద
పొద్దుపొడుపు..
ముసలి తల్లి మాత్రం
అమరుడైన తన కొడుకు కోసం
ఎదురు చూస్తుంటుంది
అక్కడ ఒక అమ్మాయి
తన ప్రియమైన భర్త కోసం
గాబరా పడుతుంటది
బిక్క ముఖాలు వేసుకున్న పిల్లలు
సగం తెగిన చందమామలు
యోధుడైన తండ్రి కోసం
ఎదురు చూస్తుంటారు
నా దేశాన్ని అమ్మిన
వారెవరో తెలవదు
కానీ ధర మాత్రం
ఎవరు చెల్లించారో చూశాను..
మూలం: మహమ్మద్ ధర్వేష్
అనువాదం: ఉదయమిత్ర
89196 50545
- Tags
- Poem
Next Story






