- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

ఇంతింతై ఆకాశమంతైనట్లు
పెరుగుతోంది ప్రేమతో
పెంచుకున్న ఆమొక్క
ఆ చేతితో నాటింది
తనకందనప్పుడు ఆనందించింది.
తనకోసమేన్నప్పుడు స్నేహమైంది
గర్వంగా పొంగిపోయి
చెప్పుకున్న రోజులేనవి.
ఓ డియోలబాయ్ చెట్టదిగో
ఊరంతంటుంటే తలపై
వజ్ర కిరీటమనుకుంది పిలిచినప్పుడల్లా...
ప్రాణంలో ప్రాణమైపోయింది
శ్వాసలో ఆ చెట్టే ధ్యాసగా మారింది.
ఎన్ని రోజులని, ఎన్ని సంవత్సరాలనీ చెప్పలేము !
కడుపున మోస్తున్న బిడ్డకన్నాఎక్కువే.
రాత్రి ఆ వేళ్ల వేదన చెబుతోంది
నన్ను చంపింది చాలనంటూ...
నేనుండొద్దని మూర్ఖుడికి బలైపోతున్న,
నేను లేదంటున్న నిజాన్ని
నీవెలా జీర్ణించుకుంటావో మరి...?
నీవు చూడని,
నీవీ వేళకు రాని సమయంలో
నేననే ఈ "చెట్టు "పై...
ఆత్మీయత పెంచుకున్న డియోలా !
తలవార్చి ఏడ్చిన
ఆ కంటినీటికి సమాధానం లేదుగా ?
చెట్టుపై పెంచుకున్న ప్రేమకు గుర్తుగా
"డియోల చెట్టు" పై లోకం దృష్టి సారించింది !
అనిత చరణ్
94945 79069
- Tags
- Poem






