స్లీపర్ కిల్లర్

by Ravi |   (  Updated:2025-10-26 23:30:48  IST  )

Poem

స్లీపర్ కిల్లర్
X

కాలం కఠిన పరీక్ష వేటలో

చిమ్మ చీకటి రహదారి బాటలో

సుదూర ప్రయాణపు నిదురలో

హైవే పై అతివేగం గారడీ తప్పి

మృత్యు ఘోషై కబళించేను

గమ్యానికి చేరవాల్సిన ప్రయాణంలో

నిర్లక్ష్యపు అతివేగం ఓ వైపు

ఓవర్ కాన్ఫిడెన్స్ ఓ వైపు

త్వరగా వెళ్ళాలని తలంపు మరో వైపు

ముందు చూపు సన్నగిల్లి

గాలి కొదిలెసిన ప్రాణాలు

పొరపాటుతో గ్రహపాటుగా

కటిక చీకటిలో బైక్ తగిలి

రసాయనాల రాపిడిలు చేలరేగి

క్షణాల్లో అగ్గిరవ్వల సేగలతో

హాహాకారాల రణ ధ్వనులతో

నిప్పుకణికల ఊచల చువ్వలకు

బూడిదలో మనుషులు బుగ్గిపాలు

మృత్యుకేళిలో నల్లని పొగలు

మిన్నంటిన కన్నీటి రోదనలు

దుంఖపు నదిలా కన్నవాళ్ళు

చెమ్మగిల్లిన మనసుల ప్రాణాలు

స్లీపర్ కిల్లర్‌తో మృత్యు శకటం

గుండె చెదిరిన పునాదులు

చిన్న పెద్ద తేడా తెలియని మరణాలు

సజీవ దహనానికి నిలువెత్తు సాక్ష్యాలు

డాక్టర్ పగిడిపల్లి సురేందరు

80748 46063

Next Story