స్వర్గం బాటలో

by Ravi |   (  Updated:2025-10-26 23:15:16  IST  )

POEM

స్వర్గం బాటలో
X

మేం తప్పిపోయాం చిన్నప్పుడు

వాడెక్కడో నేనెక్కడో

చాలాసార్లు అనుకున్నాను

నాకు బీపీ వచ్చింది షుగర్ వచ్చింది

వాడికి వచ్చిందా

నెత్తి మీద వెండికిరీటం

పెట్టుకున్నాను వాడు పెట్టుకున్నాడా

నేను శరీర దారుఢ్యం కోల్పోయాను

వాడు అంతేనా

ఎన్నో సందేహాలు సంశయాలు

మనస్సు చిక్కబట్టుకోక

ఉద్వేగం బాధలో అడుగుతున్నాను

అస్సలు వాడు ఎక్కడున్నాడు

స్నేహం మాయనిది

స్నేహసౌరభం ఎప్పటికీ వీడనిది

వార్ధక్యం లోకి ప్రవేశించాక

ప్రేమ పొంగి పొరలి

మళ్ళీ మళ్ళీ గుర్తోస్తున్నాడు

ఉత్థానపతనాలు వెలుగునీడలు

సుఖదుఃఖాలు సరే

సాహచర్యం కోల్పోయాను

కాలం ఆదమరిస్తే కత్తులు విసిరేస్తే

స్వర్గంబాటలో కలుస్తాను

కోటం చంద్రశేఖర్

94920 43348

Next Story