- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
కాలం మారింది
కొత్త శకం మొదలైంది,
మగవాళ్ల మీసం గౌరవం
ఇప్పుడది స్త్రీలకూ చేరింది!
చీరలో మెరుపు, నడకలో ధైర్యం,
మీసాల పిల్ల అంటే
ఆత్మవిశ్వాసం శ్రేయం!
కార్యాలయంలో చర్చ మొదలైనపుడు,
మాటలతో మేల్కొలుపు
"అమ్మాయి" కాదు "అధికారిణి" పదం!
కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గదు,
మీసం ఎగిరిపోతూ చెప్పుతుంది
“నేను దేనికి భయపడను!”
మేకప్పులో కాదు ఆమె శోభ,
మీసాల మాదిరిగా మెరిసే
గర్వమే ఆమె అభరణం!
తన పనితనం చాటే చతురతతో,
మగవారిని సైతం
ఆశ్చర్యపరచే చాతుర్యంతో!
మీసం అంటే కాదు గర్వపు తాటిక,
అది స్త్రీలోని శక్తికి కొత్త ప్రతీక!
మీసాల పిల్ల నువ్వే నేటి సంకేతం,
నీ చేతిలోనే రేపటి విజయగాధ కథనం!
-శైలజామిత్ర
92909 00879
- Tags
- Poem
Next Story






