- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
ఇంటిలో అందరితో
సఖ్యంగా ఉండలేడు
మింటిలో చంద్రుడిపై
కాలిడాలని కోరుకుంటాడు!
కన్నవారికి కడుపునిండా
అన్నం పెట్టలేనివాడు
పుణ్యం కొరకు
పుణ్యక్షేత్రాలు తిరిగివస్తాడు!
తన గృహాన ప్రశాంతంగా
బతక నేర్వనివాడు
అంగారక గ్రహం
ఆవాసయోగ్యమేనా అని శోధిస్తాడు!
ఉన్నదాన్ని మరుస్తాడు
లేనిదాన్ని తలుస్తాడు!
అంతా వైరుధ్యమే
అంతరంగాన యుద్ధమే!!
-జగ్గయ్య.జి
9849525802
- Tags
- Poem
Next Story






