మనసొక చీకటి సముద్రం

by Ravi |   (  Updated:2025-08-25 00:30:53  IST  )

Poem

మనసొక చీకటి సముద్రం
X

బాధలను మోస్తుంది

బరువులను దిగమింగుకుంటుంది

బాధ్యతలను భరిస్తుంది

భారం అనుకోకుండా

గుక్కతిప్పుకోలేనంతగా బిగించేస్తుంది.

గురుతులు తెలుసు

జ్ఞాపకాల మూలాలు తెలుసు

మాటల మగతు తెలుసు

గుండె గవాక్షంలో తేరి చూస్తూ

గాఢాంధకారాన్ని అనుభవిస్తుంది

మనసొక చీకటి సముద్రం

మలినం తాకని చక్కని యంత్రం

సునాయాసంగా ఎంతటి

సుదూరప్రాంతాలనైనా

చుట్టి వచ్చేయగలదు

ఎట్టి సన్నివేశాన్నైనా

యిట్టె ముద్రించుకోగలదు

వాసి జ్యోత్స్న

98668 43005

Next Story