చీకటి వార్త

by Ravi |   (  Updated:2025-08-25 00:01:17  IST  )

Poem

చీకటి వార్త
X

సంతోషం, దు:ఖం నిత్యం

అనుభవించే ప్రపంచంతో

ప్రగాఢ బంధంలో వుంటూ

ఎక్కడో దూరంగా నీతి వచనాలు

మాట్లాడటం ఇష్టం లేదు

భయం కమ్మిన విశ్వాసంతో

ఉనికిని కాపాడుకునే మనుషులు

ఆగ్రహం వ్యక్తీకరిస్తూనే

సందర్భం లేకుండా

సమయపాలన గురించి

చర్చించడం నచ్చడం లేదు..

పంచభూతాలతో ప్రమేయం

లేకుండా విస్తరిస్తూ

ఎపుడో జరిగిపోయిన

టెలివిజన్‌ చర్చాగోష్టిని

తలుచుకుని ఆశ్చర్యపోవడంలో

అస్సలు అర్థం లేదు..

సామాన్యుని జీవితం

ఇపుడో ప్రశ్నాపత్రం

ఒక దిశలో యుద్ధ భయం..

మరో దశలో విజ్ఞాన ఫలం

మానవ సంస్కృతి

హేతుమయమని నిర్ధారించి

భవిష్యత్‌ కార్యాచరణం

చేయాలనడంలో వాస్తవం లేదు..

ఒక్క క్షణం నిశ్శబ్దంలో శబ్దంగా

నేనెవరో నీవు చెప్పే దాకా తెలియదు

నిజం... ఒక దశలో నేను..

మరో దశలో నీ రూపం

శైలజామిత్ర

92909 00879

Next Story