- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
అప్పట్లో ఎన్నో మంగళ వాద్యాలు
అందరికి ఒకటి కొందరికి రెండేసి
ఇప్పుడదేదో గగనంలా..
అనితర సాధ్యమైంది ఓ పెళ్లంటే..
ఒకపుడు కుటుంబం
మంచిదైతే.. అదే పది వేలు
ఇపుడా మంచి కోణాలు
త్రాసులో ఊగుతున్నాయి
శత విధాలుగా తూగుతున్నాయి
సూట్.. అర్మానిదే ఉండాలని
స్వీట్.. బెంగాలీదే అవ్వాలనే
కొత్త పోకడలు వింత లెక్కలు
ఇలా చెబుతూ పోతే..
మూల మీది సంధు దాటుతామేమో
గాని ఆ చీటా తెగదు..
ఓ కొలిక్కి రాదు
ఒక పెళ్లి స్వర్గంలో ముడేస్తేనే
నిజ జీవితంలో ఇంత జరిగితే..
అదే నరకంలో నిర్ణయిస్తే?
ఏదేమైన ఇద్దరి మధ్య
ఎప్పటికి విడిపోని ప్రేముండాలి
చెడిపోని సఖ్యత కావాలి
ఒకరి కోసం ఒకరైపోయేలా
మారిపోవాలి
కోటం త్రిశూల్
85230 05678
- Tags
- Poem
Next Story






