మీ పేర్లేంటి?

by Ravi |   (  Updated:2025-08-24 23:46:15  IST  )

Poem

మీ పేర్లేంటి?
X

చెప్పు! నీకేమేమి పేర్లున్నాయి?

ఫిరోజ్, మున్నా, ఖురేషి?

రషీద్, ఇర్షాద్, నసీం?

అంకుర్, జతిన్, సౌరభ్, దేవేందర్?

నీ ఇంటి పేర్లు కూడా చెప్పు ?

మాకు పేర్లేమి లేవు సర్!

మేము గని కార్మికులం!

అయినా సరే..ఇంటి పేరంటూ

ఒకటి ఉంటుంది కదా?

మాకు ఇంటి పేర్లు ఇప్పుడూ లేవు!

గతంలోనూ ఎప్పుడూ లేవు!

అయితే మేము గని కార్మికులం

లేకపోతే దినసరి కూలీలం!

లేదా రైతులం, మిల్లు పనివారలం!

అంతగా కాకపోతే..

పేరూ, ఊరూ లేకుండా మురికి నాలాలు,

మ్యాన్హోల్స్ శుభ్రం చేస్తూ, ఊపిరాడక

చనిపోయే పారిశుధ్య కార్మికులం!

మాకే ప్రత్యేకమైన పేర్లూ లేవు!

నిరంతరం శ్రామిక చెమటతో

బంధించబడి ఉండేవాళ్ళం!

నిత్య అణిచివేతల నడుమ

బతికే అబద్ర జీవులం!

దిక్కు మొక్కు లేని అభాగ్య జీవులం!

అడిగావు కదా.,

భారతదేశంలో ఇదే మా ఇంటి పేరు సర్!

ఇంగ్లీష్ - మౌమితా ఆలం కవిత

తెలుగు అనువాదం - గీతాంజలి

88977 91964

Next Story