- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
కడుపులోని బిడ్డలకు
రసాయన మందుల పరిచయం,
బయట అవని పైకి
రాకముందే భవిష్యత్తుపై భయం.
పుట్టకముందే ప్రారంభమైంది
అనారోగ్యంతో యుద్ధం,
అమ్మ కడుపులో అడగకుండానే
ఆల్కహాల్ ఇంజక్షన్
ఆరోగ్యం కోసం కాదు,
అనారోగ్యం కోసం అమ్మ గర్భంలో
నింపుతున్న విషం,
అడగకుండానే వచ్చింది కదా
అది అమ్మ ప్రసవమా లేక
పురుగు మందుల విష ప్రభావమా?
పల్లెల్లో పసిబిడ్డల రోదనలు
ఆసుపత్రుల్లో రోగాల రొదలు
తల్లికి తెలియకనే ఇస్తుండే
రసాయనాల విషపు పాలు
పాల బుగ్గల పసిపిల్లలకు
పురుగుమందుతోనే రోగాలు
అడగకుండానే ఇచ్చిన ఇంజెక్షన్లు
అమ్మ కడుపులో ఉన్న బిడ్డకు
పుట్టుకతోనే బహుమానలు
విత్తనం వేసింది మనం
పంటల్లో పాలల్లో విషం నింపింది మనం
మనిషి జీవితం విషాదం
ఆధునికత.. అంతా.. అబద్దం.
దుప్పటి మొగిలి
84668 27118
- Tags
- Poem
Next Story






