దిక్సూచి

by Ravi |   (  Updated:2025-08-17 23:30:58  IST  )

Poem

దిక్సూచి
X

శిలను నేనే.. ఉలిని నేనే

తీర్చిదిద్దే శిల్పి నేనే

నన్ను నేను

గాయపరుచుకుంటూ

కాలానికి తలవంచని

శిల్పంగా మలుచుకుంటూ

విషాదమంటని ఉషోదయాన

విలాపమెరుగని లోకాన

నన్ను నేనే

ప్రతిష్టించుకుంటాను!

ఆకలి లేని ఆశకుపోని

మమతను పంచి

సమతను పెంచి

కలతలు తుంచే

మరో ప్రపంచానికి

దారి చూపే దిక్సూచినౌతాను!!

ధవళేశ్వరపు రవికుమార్

98487 12197

Next Story