- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

తెల్లవారి వెలుగుతో ఆమె ముఖం
చిరునవ్వును అలంకరించుకుంటుంది
నిద్ర లేని రాత్రులతో ఎర్రబడ్డ కళ్లను
కళ్లజోడుతో దాచేస్తుంది
ఆమె ఆత్మస్థైర్యం లోకం సంతోషంగా
స్వీకరించలేకపోతోంది
లోలోపల అంత బడబానలాన్ని మోస్తూ
అంత ప్రశాంతంగా ఎలా ఉంటుంది
ఏమైనా చెపితే బాగుండునని
సానుభూతి చూపించటానికి
కడివెడు కన్నీళ్లు, కళ్లనిండా కరుణ
వర్షించటానికి సిద్ధంగా ఉంటుంది లోకం
ఆమె ఏడవదా? ఏడుస్తుంది,
నిశ్శబ్దంగా.. నిశ్శబ్ద నిశీధిలో
లోకమంతా గాఢ నిద్రలో తమను తాము
మరిచిన వేళలో మూగగా రోదిస్తుంది
తనలో తనే మాట్లాడుకుంటూ
ఊరికే వెక్కి వెక్కి ఏడుస్తూ
తనలో తనే నవ్వుకుంటూ
అర్థరాత్రి దాటినా నిద్ర రాక
అమాయకంగా అమ్మనే చూస్తూ
ఎప్పటికీ పసిపాపగానే మిగిలిపోతున్న
తన చిన్నారి కూతురి
భవితను తలచుకుని
అభద్రతా భారంతో చీకటి సాక్షిగా
ఏడుస్తూనే ఉంటుంది
సహానుభూతి దొరకని సానుభూతి
ఎందుకని ఆమె చిరునవ్వుని
అతికించుకుంటుంది
ఆమె గుండె లోలోపల వర్షం
కురుస్తూనే వుంటుంది.
- డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి
63027 38678
- Tags
- Poem






