నేటి ప్రపంచంలో

by Ravi |   (  Updated:2025-07-21 00:00:13  IST  )

Poem

నేటి ప్రపంచంలో
X

నేటి ప్రపంచంలో

నవ్వుకు ఉండే విలువ, బాధకు లేదు.

డబ్బుకు ఉండే విలువ, గుణానికి లేదు.

అబద్ధానికి ఉండే విలువ, నిజాయితీకి లేదు.

ఇదే నాకు తెలిసిన ప్రపంచం.

అధికారానికి ఉండే గొప్ప, సేవకు లేదు.

పేరుకు ఉండే ఆడంబరం, ప్రేమకు లేదు.

కాంతికి ఉండే ఆకర్షణ, మనసుకు లేదు.

ఇదే నీవు చూసే సత్యం.

స్వార్థానికి ఉండే బలం, త్యాగానికి లేదు.

కోపానికి ఉండే శక్తి, ఓర్పుకు లేదు.

హోదాకు ఉండే గర్వం, నమ్రతకు లేదు.

ఇదే నీవు తెలుసుకోవాల్సిన జ్ఞానం.

అసూయకు ఉండే తాకిడి, కరుణకు లేదు.

వేగానికి ఉండే హడావిడి, శాంతికి లేదు.

ఆస్తికి ఉండే ఆర్భాటం, సంతోషానికి లేదు.

ఇదే నీవు గ్రహించాల్సిన సత్యం.

-తేరాల సాధన గౌడ్

70367 92969

Next Story