ఏమీ చేయలేవు

by Ravi |   (  Updated:2025-07-20 23:31:07  IST  )

Poem

ఏమీ చేయలేవు
X

సరే

నువ్వందర్నీ చంపేస్తావు

అందరిని పెట్రోల్ పోసి బూడిద చేసేస్తావు

వారి నుదుటిపై ముద్దు పెట్టుకోనియవు

వారి అరిపాదాలను గుండెలకు

హత్తుకోనీయవు

పర్వతాలను బుల్డోజర్లతో

పెళ్ళగించేస్తావు

అడవినీ ఆనవాళ్లు లేకుండా

నరికి పారేస్తావు

ఆ మట్టిని గుండెకు పూసుకోనీయవు

రాలి పడిన ఆకులను తాకనీయవు

చీకటి పక్కనే వెలుగు

దాగి ఉంటుందన్న నమ్మకాన్ని

మాత్రం ఏమీ చేయలేవు!!!

కెక్యూబ్

94934 36277

Next Story