- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
బాలుడు అన్నాడు,
‘కొన్నిసార్లు నా చెంచాను కింద పడేస్తాను'
బాల వృద్ధుడు చెప్పాడు
‘నేను కూడా అది చేస్తాను'
బాలుడు గుస గుసగా అన్నాడు
‘నేను నా ప్యాంటు తడిపేస్తాను'
‘నేనూ అది చేస్తాను'
అని నవ్వాడు బాల వృద్ధుడు
బాలుడు అన్నాడు…
‘నేను ఎక్కువగా ఏడుస్తుంటాను ‘
బాల వృద్ధుడు తల ఊపుతూ ‘నేను కూడా ‘
‘అన్నింటికంటే అధ్వానం
పెద్దవాళ్ళు నాపట్ల శ్రద్ద చూపట్లేదని
అనిపిస్తుంది’, అన్నాడు బాలుడు
ముడతలు పడిన వృద్ధుని చేతి స్పర్శ
వెచ్చని అనుభూతిని బాలుడు పొందాడు
‘నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో
నాకు తెలుసు’, అన్నాడు ఆ బాల వృద్ధుడు.
అనువాదం
డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి.
63027 38678
- Tags
- Poem
Next Story






