- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

నా కూతురి ఇంటి పేరు రాసేముందు
అకస్మాత్తుగా ఆగిపోయాను!
స్కూల్ బ్యాగ్ పైన ఆమె పేరు చివర
ఇంటిపేరు రాసేముందూ ఆగిపోయాను!
ఎందుకంటే, నిత్యం మమ్మల్ని
కుతూహలంతో వెంటాడే చూపుల నుంచి
తప్పించుకోవాలనుకున్నానేమో బహుశా!
ఒకరోజు,
నా కూతురు నన్ను అడగనే అడిగింది!
ఎందుకు అమ్మీ నా పేరు
ఎప్పుడూ పూర్తిగా రాయవు అని.
నేను గాభరాగా ఆమె నోరు మూసాను.
ప్రముఖంగా కనిపించేట్లు
ఇంటి పేరు లేకుండా తక్కువ స్థాయిలో
బతకడమే మంచిది అని
నా కూతుర్ని బుజ్జగించాను
అంతే కాదు! ప్రతి రాత్రి స్కూల్లో
తనకి ఇష్టమైన వంటకాల పేర్లు
పొరపాటున కూడా చెప్పద్దు అని చెప్పేదాన్ని.
నిద్రలో కూడా ఆమె మెదడులో
ఈ మాటలు కుక్కేదాన్ని.
ఏం మాంసమైనా కోడికూరే
ఎద్దు బిరియాని కూడా
కోడి లేదా మేక బిర్యానీగా మారిపోయేది మాకు!
అందరికీ, మీకు తెలియదేమో కానీ.,
మేము ఆ రకమైన ముస్లింలం కాము,!
ఎద్దు మాంసం తినము అని చెప్పమనేదాన్ని.
అందరినుంచీ తనెవరో తెలీకుండా దాచాలని,
తనని తాను కాస్త తలుపు
వెనకాల దాచి పెట్టుకోమని,
నేను నా కూతురుకి
ఎప్పుడూ నేర్పిస్తూ ఉండే దానిని.
ఓహ్.. చూడండి
బడి గంటలు మోగుతున్నాయి.
కానీ బడిలో ఉండే వేరే పిల్లలకు మోగినట్లు
నా కూతురు కోసం మాత్రం మోగవెందుకో!
ఇంగ్లీష్ మూలం - మౌమిత ఆలం
తెలుగు అనువాదం - గీతాంజలి
88977 91964
- Tags
- Poem






