- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
నా కన్నీటికి కారణం
నువ్వని నేననను
నా వేదనకు వేకువ
నా ఆవేదనకు లోకువ
నీకు తెలుసనీ నేననుకోను
నా ప్రతి అక్షరం
నా హృదయ గవాక్షంలో
నేను లిఖించుకున్న
రేపటి నవోదయం కోసమే
నూతనంగా నిర్మించుకోవడం కోసమే
నిన్ను నేను చేరలేను
నన్ను నేను నొచ్చుకొని..!
గుచ్చుకున్న నీ పదముల అగ్నిబాణాలు
నను విచ్చుకోనివ్వడంలేదు
ప్రపంచానికి పరిచయం కానివ్వడంలేదు
కారణం ఏదైనా కానివ్వు ....
కవిత్వం నాకు ఊపిరయ్యింది
జరిగిన కథ జీవితం నేర్పింది
కన్నపేగు బలం అయ్యింది
వేసే ప్రతి అడుగులో
స్థిరత్వం తోడయ్యింది
వాసి జ్యోత్స్న
9866843005
- Tags
- Poem
Next Story






