మనసు మునిగిన క్షణం

by Ravi |   (  Updated:2025-07-14 00:15:03  IST  )

Poem

మనసు మునిగిన క్షణం
X

ఆనందంతో మనసు

మునిగెను ఎంతసేపు!

ఎద పులకరించే,

పలకరించినంత సేపు!

ఉత్సాహంతో ఉరకలెసెను

ఉన్నంత సేపు,

మనుషుల మధ్య మమతలు

మెరిసినంత సేపు!

బాధించెను భరించలేనంతలా,

అనిపించెను అనంతమైనంతలా!

ఆవేశించెను ఐచ్ఛికంతలా,

గడియ మారెను

గమనించకుండనే అంతలోపు!

తాత్కాలికమే ఈ జీవన రాగం,

శాశ్వతమైనది హృదయ

స్పందన లయం!

మనసు మునిగిన

మాయా సముద్రంలో,

మధురిమలు మిగిలెను

మనసు ఒడ్డున!

రాచకొండ సాగర్

70958 22883.

Next Story