- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
ఎటు పోతున్నాం మనం
కాలం హెచ్చరిస్తున్న కనం
సంస్కృతి విడిచి, సభ్యత మరచి
మనుషులమనే భావన మరచి
హత్యలు ఎందుకోసం, ఎవరికోసం
కాలం మారుతోందా?
ఆలోచనలు మారుతున్నాయా?
ఎవరు చెప్పినా వినం
చట్టాలను లెక్కచేయం
తనకు తెలిసిందే వేదం
తాను మునిగిందే గంగా
ఏదలోతుల్లోంచి మమత మయం
పుస్తకాల్లో వల్లించిన సమత మాయం
జాలి దయ కరువయే..
పుట్టుక నీదా
తల్లి పురిటి నొప్పుల బాధ కానరాదా?
ఆడబిడ్డల కన్నీటి ఉసురు ఎవరిదీ
కళ్లకు ముసురుకున్న మత్తు వదిలేదెలా?
నేటి యువతరాన్ని మేల్కొల్పేదెలా?
రాబోయే తరానికి నీవే ఆదర్శం..
-మమత జక్కుల
63055 60132
- Tags
- Poem
Next Story






