- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
ఇష్టం ముదిరి
పట్టపగలే కల జోలెతో
అర్థరాత్రిని తలుపు కొట్టింది
తలుపు తెరిచి వేసిన భిక్షకి
రుణం తీర్చలేకపోయింది జ్ఞాపకం
ఎడారిగా మారిన నిద్ర సంద్రంపై
ఈత రాని కునుకు
ఏకాంతాన్ని ఢీ కొట్టి పడక చెదిరి
మదిగదంతా పడమటి గాలులే.
తొలి లేఖలోని
చిట్లిన ముఖాలతో ఉన్న వాక్యాలు
బతుకు పొలిమేరలో పిచ్చి గీతలతో కలసి
పాత ఇష్టాలకు కసిగా
తిరిగి బట్వాడా చేయాలని
చిరునామా కోసం గాలిస్తున్నాయి..
చందలూరి నారాయణరావు
97044 37247
- Tags
- Poem
Next Story






