ఆత్మహత్య

by Ravi |   (  Updated:2025-07-14 00:31:06  IST  )

Poem

ఆత్మహత్య
X

ఆత్మహత్యలు అర్థరాత్రి

తీసుకునే నిర్ణయాలు కావు

గాజు కళ్ళు చెమ్మగిల్లాక

ఆఖరి కన్నీటి బొట్లు

కూడా వదిలెళ్లాక

శూన్యపుటంచుల్లో

వేలాడే నిర్జీవపు మనిషికి

దిక్కుతోచని స్థితిలో

కనిపించే ఏకైక దారి.

ఆత్మహత్యలు..

పిరికితనానికి ప్రతీకలు కావు.

చిగురుటాకులా వణుకుతూ

బతకాల్సినప్పుడు

కీలు బొమ్మలా

మారక తప్పనప్పుడు

ఏళ్లుగా కట్టబడిన

సంకెళ్లు తెంచగలిగే ధైర్యం.

ఆత్మహత్యలు ఒంటరి నిర్ణయాలు కాదు.

అనేకానేక ఆలోచనల గజిబిజీలో

గెలుపొందిన పరిష్కారమే ఆత్మహత్య.

- వరలక్ష్మి బొల్లె

95739 60304

Next Story