మారండి

by Ravi |   (  Updated:2025-07-14 00:45:40  IST  )

Poem

మారండి
X

కొందరుంటారు

ఎప్పుడూ వారిని

పొగడాలని చూస్తారు!

ఎదుటివారి మంచిని

అభినందించరు

అంతర్గత అసూయ కాదా!

అభినందించడం

ఆత్మీయ హృదయ స్పందన

మెచ్చుకుంటే మానసిక ఉల్లాసం!

తమకు తాము

జ్ఞాని అనుకుంటారు

సమాచారాన్ని దిగుమతి చేసుకుంటారు!

వేసిన రహదారి మీద నడుస్తారు

వారు బాటసారి మాత్రమే!

భజన బృందం

బానిస భావాలతో

తాళం వాయిస్తే

తన్మయత్వం చెందుతారు!

కొందరు కొత్తగా దారివేసి

గమ్యాన్ని సూచిస్తారు

వారు మార్గదర్శి!

మారండి!

మనుషుల్లో కలవండి!!

జగ్గయ్య.జి

98495 25802

Next Story