దృఢమైన నమ్మకం

by Ravi |   (  Updated:2025-07-09 00:30:43  IST  )

Poem

దృఢమైన నమ్మకం
X

వేరుతన్ని

విస్తరించిన ఓ చెట్టును...

వ్రేళ్లతో సహా

జాగ్రత్తగా పైకి తీసి

మరో కొత్త ప్రాంతంలో

అంతే జాగ్రత్తగా నాటితే ....

ఎలా ఉంటుందో

అచ్చం అలా ఉంది

ఇప్పుడు మా పరిస్థితి

కొత్త ప్రపంచం

పరిచయమే లేని పరిసరాలు

ముఖ పరిచయం

కూడా లేని మనుషులు

కాస్తంత భయం

మరి కాస్తంత ధైర్యం

ఇదీ అని స్పష్టంగా చెప్పలేని

చిత్రమైన అనుభూతి

అన్నీ చక్కబడతాయి

జీవితం కొనసాగుతూనే ఉంటుంది

అపరిచితమైన ఈ తావే

వీడిపోలేని బంధమైపోతుంది

ఇదే ఇదే

మా మువ్వురి

దృఢమైన నమ్మకం

- రత్నాజేయ్

94945 49969

Next Story