- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

ఒకప్పుడు
చిగురాకులతో, ఆకు పచ్చని
కొమ్మల, రెమ్మలతో
చాలా గొప్పగా
సంపన్నంగా ఆరోగ్యంగా ఉండేది
పువ్వులతో, కాయలతో, పళ్లతో
అందరికీ ఉపయోగపడుతున్నాననే
ఆత్మ విశ్వాసంతో, ఆత్మ గౌరవంతో,
సంతోషంగా ఉండేది
తామర తంపరగా విస్తరించిన
తన సంతతిని చూసి
తనకే లోటు లేదని మురిసిపోయింది
శిశిరంలో ఎండి నేలరాలినా
వసంత శోభతో మళ్ళీ
చిగురు తొడిగి పులకించింది
జీవన సంద్రపు
ఆటుపోట్లను,
పెను తుఫానులను
సవాళ్ళుగా తీసుకుని
ఎక్కుపెట్టిన బాణంలా
తిరిగి తలెత్తుకుని నిలబడింది
చేవ తగ్గి, సార హీనమై
నేల రాలటానికి సిద్ధంగా ఉన్న
పండుటాకు తన
జీవిత అనుభవ సారాన్ని
స్ఫూర్తి పాఠాలుగా
తరవాతి తరానికి
చెప్పాలనుకుంటుంటే
సామాజిక మాధ్యమాల
విజ్ఞాన సర్వస్వాల నుంచి
సమగ్ర జ్ఞానాన్ని సేకరించే
తరవాతి తరానికి
పండుటాకు పరమ జీవన వేదం
పనికిరానిదయి పోతోంది.
- డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి
63027 38678
- Tags
- Poem






