- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

నిలబడ్డ ఈ స్థూపాలన్నీ
ఏ పల్లె తల్లి కంటి గాయాల గుర్తుల్లో
వీరు శిలువేయబడి ఎన్నేళ్లయిందో ఏమో...
ఇక్కడ గాయాల ఛాయలు
ఇంకా మాననేలేదు.
అయినా ఇప్పుడే వికసించిన
మందారాలా అన్నట్లు ఉన్నారు.
ఎన్ని నెత్తుటి త్యాగాల గుర్తుల్లో
వీరంతా కన్న తల్లి నెత్తుటి గాయాలలో
జ్ఞాపకాల ఛాయగా మిగిలిపోతుంటే...
ఈ మట్టి పువ్వులన్ని
పుట్టిన మట్టికోసం రాలిపోయినా
పరిమళిస్తూనే ఉన్నాయి.
ఒక్కొక్క పువ్వు పుప్పొడి రాలి
జాతి విత్తనాలై మట్టినిండా
తమ దేహాలను పరిచాయి.
పోరు తెలంగాణ ఉద్యమానికి
పునాదులు కట్టాయి.
ఈ స్థూపాల త్యాగాలకు
కాసిన గాయాల గుర్తులే
ఈ మట్టి గంధాన్ని ప్రపంచ దేశాల్లో
పరిమళింపజేశాయి.
పండుటాకులు రాలిపోతేనే కదా
పసరుటాకులు చిగుర్లు తొడిగేది!
అమావాస్య తర్వాత పున్నమిలా
నాటి గాయాల ఛాయలే నేడు
గెలుపుకు దారిని చూపాయి.
ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎత
వీరులంతా ఆకాశంలో తారలై
ఆ సింగిడిని నేలమీదకు ఒంపుతున్నారేమో!
తెలంగాణ నేలంతా
సింగిడి రంగులను అల్లుతోంది.
వీరుల రక్తంతో తడిసిన
గాయాల ఛాయల జ్ఞాపకాలు
చరిత్ర పుటలలో ఎప్పటికీ నిలిచిపోతాయి.
ప్రతి గాయం… ఓ విజయంగా!!
జె. సునీత
- Tags
- Poem






