- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
చుక్క నీటితో
గొంతు తడుపుకోవాలని
నోర్లు తెరిచి
నెర్రెలువాసిన భూమి
కళ్ళు కాయలు కాసేలా
పంటలతో కలకళలాడాల్సిన
బీడుభూములు
ఎదురుచూస్తున్నాయి ఒకపక్క
బోరు గొట్టాలతో
భూమి గుండెల్లో
తూట్లు పొడుస్తున్నా
పాతాళం లోకి వెల్లి వెతికినా
కంటికి కానరాక
భూమి లోపలి పొరల్లో
తడి ఇంకిపోతున్న
భూగర్భ జలాలు
ఇంకొక పక్క
తొలకరి కోసం
కళ్ళు కాయలు కాసేలా
ఎదురు చూస్తూ
నారు పోయాలని
మడి నాటాలని
సన్నాహాలు చేసుకుంటూ
అహర్నిశలు కృషి చేసే
బక్కచిక్కిన రైతన్న ఓ పక్క
కాలే కడుపుకి
దివికేగిన మండే ధరలొక పక్క
మొండి బకాయిలతో
ఊరి పెత్తందారుకి
వడ్డీకి వడ్డీ చెల్లించే
రైతన్న గుండె ఘోషకి
సొల్యూషన్ ఎక్కడో? ఎప్పుడో?
దేవలపల్లి సునంద
92915 99562
- Tags
- Poem
Next Story






