- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

మనసెన్నిసార్లు
మథనపడి వుండిందో
ఎన్ని ముక్కలైందో
ఎంత దుఃఖించి ఉంటుందో
ప్రత్యామ్నాయ దారులేవీ
కనుచూపు మేరలో
దర్శనమీయకుంటే
తోటివారికి చెప్పుకున్నా
సమస్య జటిలమయి
మనసును తొలిచేస్తుంది
కట్టుకున్న వాడే
ఈ దారుణానికి విత్తునాటితే
ఆత్మాభిమానం వున్నవారెరికైనా
మానసిక సంఘర్షణల అనంతరం
నిష్క్రమణ ఇక ఒకటే మార్గమని
బలమైన దెబ్బతీస్తుంది
గతకాలపు ధైర్యం
మరుగున పడ్డప్పుడు
తనను తాను చంపుకోవడమే..
ఆత్మహత్య.. కదా!
బలవంతంగా నెట్టబడిందో
లోతునది సుడిగుండం
మధ్యలో చిక్కుకుపోతే
మునగటమే కాని తేలేది లేదు
నిప్పుల గుండంలో పడేస్తే
భగ్గున కాలుతూ బూడిదవడమే
భీకర యుద్ధంలో తూటాలకు
స్వాగతం చెప్పడమే..
దరిదాపుల్లో ఏ రక్షణా
దొరకనపుడు
అనేక వందల రకాల
భయాలిప్పుడేమీ చేయవ్
నిర్ణయం తీసుకోవటం కంటే
అమలు జరిపిన పిదప
ఆశంసలు (ఆశలు) ఆలోచనలు
గడ్డితో బరాబర్
రంపపు కోతకు
సిద్ధంగా వుంటే చచ్చిపో...
నిరీక్షణకు...
యుగాలు పడుతుంది
అరక్షణకు.. క్షణం చాలు.
కపిల రాంకుమార్
98495 35033
- Tags
- Poem






