ఎహ్... పో..

by Ravi |   (  Updated:2025-06-30 00:01:08  IST  )

Poem

ఎహ్... పో..
X

అరేయ్ పెద్దాయినాక ఏమైతావ్ రా...

ఏముంది ఇప్పుడు బుడ్డగున్నా...

అప్పుడు పెద్దగా అయిపోతా....

కానీ.. పెద్దాయినంక పారాయణ

బట్టి సదువులు సద్వాలన....

పక్కింటాయిన ఏ కోర్స్ సదివితే

నేను అదే సదవాలా

కoప్యూటర్ కొలువులే చెయ్యాలన

లేకుంటే పెన్షన్ లేని, జీతం రాని

సర్కార్ జాబ్ చెయ్యాలనా...

రాజకీయాలకి డబ్బులిచ్చి ఓట్లు కొనలా....

డబ్బు తీసుకొని ఓట్ ఎయ్యాలా....

ఎహ్... పో.... నేను పెద్దోన్ని కాను

మా అమ్మ సంకన పాలుతాక్కుంటా

ఇట్లనే వుంటా.....

ఎన్. శ్రీనివాస్,

98486 13844

Next Story