- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
ఇంటిముందు
మంచంపై పడుకుని
ఆకాశంలో చుక్కల్ని
లెక్కగడతావుంటా
నాకు చుక్కలన్నీ కథలు
మా తాత చుట్ట తాగుతూ
చెప్పెవాడు
ఊకొట్టి ఊకొట్టి
నా ఆశలను తాడుచేసి
చందమామ కు విసిరేవాడ్నీ
చందమామ చివర కూర్చొని
అమ్మ పాడే జోల పాటల్ని వినేవాడ్నీ
నక్షత్రాలను తెంపీ
అమ్మకు పూలేట్టే వాడ్నీ
రాత్రి వెలుగుతున్న దీపంలా
మిణుగురును పట్టుకుని
అమ్మకు బొట్టెట్టె వాడ్నీ
కోటానుకోట్ల నక్షత్రాల మధ్య వున్న
నాకు మాత్రం మా అమ్మే కనబడేది.
తంగిరాల సోని
96766 09234
- Tags
- Poem
Next Story






