- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
శతృదేశాలు లక్షం చేసుకొని
ఎత్తైన నివాస భవనాలు
వాణిజ్య పరమైన పెద్ద దుకాణాలు
స్టార్ హోటళ్లు కూల్చారు
నిర్దయగా పాఠశాలలు కళాశాలలు
ఆసుపత్రులు కూల్చారు
రెండు నగరాలను
కలిపే వంతెనల మీద
బాంబులేశారు కూల్చారు
ప్రభుత ప్రకటించింది
ఏడాదిలో నిర్మిస్తామని
ఈ క్రమంలో చెట్లు మహావృక్షాలు
నేల కూలాయి
పెల్లుబికిన పశ్చాత్తాపం లేదు
పచ్చదనం గుండెచప్పుళ్లు వినలేదు
కనీసం కొన్ని మొక్కలు నాటి
పరిహారం దిశలో కూడా సాగలేదు
ఏ రాజుకు నివేదించుకోవాలి
ఏ కోర్టుకు మొరపెట్టుకోవాలి
ప్రకృతి కన్నెర్ర జేస్తూ నిర్ణయం
కోటం చంద్రశేఖర్
94920 43348
- Tags
- Poem
Next Story






