పిల్లచేష్టలు..

by Ravi |   (  Updated:2025-06-22 23:45:34  IST  )

Poem

పిల్లచేష్టలు..
X

బాధ్యత తెలీని పిల్లలు,

చుట్టూ తలొక పనిలో

తలమునకలై ఉన్న

మాకు పట్టదులే అనే

పసితనపు పాపలు

పారాడే నేలను వదిలి

ఆటపాటల బరిని వదిలి

అమ్మనాన్నల లాలింపులేక

వెతుకులాడిన వేదన

పని చెయ్యని తనం ఎత్తిచూపి

సమావేశాల సారాశం సున్నా

నిద్రను, ఆకలిని బలిచ్చి

ఒంటికి రోగాల వలనే

చుట్టుకున్నది మిగిలింది

చివరికి కూర్చుని ఏం లాభం

అదే మొత్తం మంటల్లో కాలి

ఆనవాలునే లేకుండా చేసింది

- అరుణకమల

9676443185

Next Story