- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
ముళ్ల కంచె
తమకు రక్షణగా ఉందని
నిశ్చింతగా
పచ్చని చెట్లు గాలికి
తలలూపుతూ ఆనందంతో
తోటంతా తామే అయి
చిందులు వేస్తున్నాయి
లేత మొగ్గలు
రంగు రంగుల పువ్వులు
ముగ్ధ మనోహరంగా తోటను
సుగంధ భరితం చేస్తున్నాయి
పాపం! ఆ పసి మొగ్గలకేం తెలుసు?
కాపాడుతుందనుకునే కంచే
తమను చిదిమేస్తుందని!
వావి, వరస
మనసు, మమత
అనే పదాలనే
తమ జీవిత నిఘంటు నుంచి
తొలగించేసిన
అమానవీయ కంచె
చేనును మేసేస్తోంది!
డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి
63027 38678
- Tags
- Poem
Next Story






