మట్టి -మనిషి

by Ravi |   (  Updated:2025-06-23 00:15:10  IST  )

Poem

మట్టి -మనిషి
X

పంచభూతాలలో

ఆకాశం, వాయువు

అగ్ని, వరుణుడు

పురుష శక్తులు కాగా

భూమాత స్త్రీ మూర్తి

చెట్టు పుట్ట గుట్టలు

జీవ నదులు హిమగిరులు

లోహాలు ఖనిజాలు

సముద్రాలన్నింటినీ

మోస్తున్న అమ్మ

విశ్వంభర .. వసుంధర!

తల్లీ!! సర్వ చరాచర జీవులు

నీ ఒడి నీడన బ్రతుకు..

అన్నింటికి అన్నప్రదాతవు

పాడి పంటలు నీ ప్రసాదాలు

బతికినంతకాలం నీవే ఆధారం..

కాలం తీరి కన్నుమూస్తే

దహనం నీ మేని పైనే..

ఖననం నీ కడుపులోనే.

మానవా - ఓ మానవా!

చెట్లను కొట్టేస్తే

అడవులు అంతరిస్తే

ప్రకృతి సమతుల్యత పాడై

తరిగె ప్రాణ వాయువు

పెరిగె అనారోగ్యం.

వన్యప్రాణులు దిక్కులేక

ఊరు బాటకు చేరుతున్నవి

భూవనరుల రక్షణ

భావి తరాల సంపద

భూమాతకు కృతజ్ఞత.

- వొల్లాల చిరంజీవి నరసయ్య

94403 58811

Next Story